Site icon NTV Telugu

RCB vs LSG: సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

Rcb

Rcb

RCB vs LSG: లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. ఈ సీజన్‌లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఆర్సీబీ బౌలర్‌లకు చుక్కలు చూపించాడు పంత్. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇందులో 6 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక, రిషబ్ పంత్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా హాఫ్ సెంచరీతో ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట అడుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే 67 రన్స్ చేశాడు.

Read Also: Kannappa : కన్నప్ప మూవీపై కుట్ర.. నిర్మాణ సంస్థ సంచలన ప్రకటన..

అయితే, లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన 227 పరుగులు చేసింది. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 228 పరుగుల టార్గెట్ ను ఛేదించాలి. కాగా, ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆర్సీబీ పాయింట్ల టేబుల్ లో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఓడిపోతే.. ఎలిమినేటర్ ముంబై ఇండియన్స్ తో మరోసారి తలపడాల్సి వస్తుంది.

Exit mobile version