ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తడబడ్డారు. 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్ ముందు 160 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచారు. చివర్లో ప్యాట్ కమిన్స్ (30) పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ట్రేవిస్ హెడ్ మరోసారి గోల్డెన్ డక్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఆశలు పెట్టుకుంటే ఆ ఆశలను కాస్త ముంచేశాడు. కేవలం 3 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
Shane Watson: ఆర్సిబి అభిమానులకు క్షమాపణలు చెప్పిన షేన్ వాట్సన్.. ‘నా వల్లే అంతా’ అంటూ..
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి (55) పరుగులు చేశాడు. త్రిపాఠి ఉన్నంతసేపు పర్వాలేదనిపించినా రనౌట్ రూపంలో ఔటయ్యాడు. తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి (9) పరుగులు మాత్రమే చేయగలిగాడు. షాబాజ్ అహ్మద్ డకౌట్ కాగా.. క్లాసెన్ (32) పరుగులతో రాణించాడు. క్లాసెన్ ఉన్నంతసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సిక్సర్ కొట్టే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర రింకూ సింగ్ దొరికిపోయాడు.
ACB Joint Director: ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. ఏడు చోట్ల కొనసాగుతున్న సోదాలు
అబ్దుల్ సమద్ (16), సన్వీర్ సింగ్ డకౌట్, కమిన్స్ (30) పరుగులు చేసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. భువనేశ్వర్ కుమార్ డకౌట్, విజయకాంత్ వియస్కాంత్ (7) పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బ్యాటర్లలో నలుగురు బ్యాట్స్ మెన్లు డకౌట్ అయ్యారు. కోల్కతా బౌలింగ్ లో మిచెల్ స్టార్ మొదట్లోనే హెడ్ వికెట్ తీసి సన్ రైజర్స్ ను దెబ్బ తీశాడు. అతని బౌలింగ్ లో 3 కీలక వికెట్లు సంపాదించాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టగా.. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ సాధించారు.