Site icon NTV Telugu

SRH vs KKR: పోరాడుతున్న కేకేఆర్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!

Kkr 10 Overs Score

Kkr 10 Overs Score

Kolkata Knight Riders Scored 96 With 4 Wickets Loss Against SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గట్టిగానే పోరాడుతోంది. మొదటి పది ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మొదట్లోనే కేకేఆర్ జట్టు వరుసగా మూడు వికెట్లు కోల్పోయినా.. జగదీశన్, నితీశ్ రానా మాత్రం చితక్కొట్టేశారు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అయితే కెప్టెన్ నితీశ్ తాండవం చేశాడు. అత్యంత వేగంతో క్లిష్టతరమైన బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని అతడు బౌండరీలు బాదాడు. అతని ఒక్క ఓవర్‌లోనే 28 పరుగులు కొట్టడంతో.. కేకేఆర్ స్కోర్ బోర్డ్ ఒక్కసారిగా పరుగులు పెట్టింది. కెప్టెన్ రెచ్చిపోవడంతో.. జగదీశన్ కూడా ఖాతా తెరువడం మొదలుపెట్టారు.

Pooja Hegde: పూజా.. నీ ప్యాంట్ చిరిగింది.. చూసుకో

ఇలా వీళ్లిద్దరు ఎడాపెడా షాట్లు బాది.. కాసేపు ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. నాలుగో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే.. ఆ జోష్‌లోనే జగదీశన్ ఒక భారీ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. మార్కండే ఓవర్‌లో షాట్ కొట్టగా.. అది నేరుగా మార్ర్కమ్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. 82 పరుగుల వద్ద జగదీశన్ పెవిలియన్ చేరాడు. ఇతడు ఔటయ్యాక ఆండ్రూ రసెల్ క్రీజులోకి వచ్చాడు. అయితే.. అతడు 11వ ఓవర్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. కేకేఆర్ జట్టు ఇంకా లక్ష్యాన్ని ఛేధించాలంటే.. 9.5 ఓవర్లలో 133 పరుగులు చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి.. ఇది కేకేఆర్‌కు కత్తిమీద సాము వంటిదే. మరి.. కేకేఆర్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.

Emma Watson: రాజకీయాల్లో ‘హారీ పాటర్’ భామ!

Exit mobile version