NTV Telugu Site icon

Sanjiv Goenka: రాహుల్ను వదిలేసిన లక్నో.. సంజీవ్‌ గొయెంకాను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్స్..

Lsg

Lsg

Sanjiv Goenka: ఐపీఎల్‌ 2025లో రిటెన్షన్‌ జాబితాలో స్టార్ క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ కు చెదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం నిర్ణయంపై ఇప్పుడు భారీగా ట్రోలింగ్‌ ఎదుర్కొంటుంది. ఆ టీమ్ నికోలస్‌ పూరన్‌, రవి బిష్ణోయ్‌, మయాంక్‌ యాదవ్‌, మొహసిన్‌ ఖాన్‌ లాంటి వారిని జట్టులో కొనసాగించింది. ఐపీఎల్‌ రిటెన్షన్లకు ముందు ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్‌ గొయెంకా మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో మేము ఒక్కటే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం.. గెలవాలన్న లక్ష్యంతో ఉన్న వారినే ఎంపిక చేశామన్నారు. వ్యక్తిగత లక్ష్యాలకు దూరంగా టీమ్ విజయం కోసం శ్రమించే వారికే ప్రాధాన్యమిచ్చామన్నారు.

Read Also: Hyderabad Crime: చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ .. నిందితుడు డాక్టర్ కాదా..?

కాగా, మా తొలి రిటెన్షన్‌ నిర్ణయం కేవలం రెండు నిమిషాల్లోనే తీసుకొన్నామని ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్‌ గొయెంకా తెలిపారు. మేము అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు మొహసిన్‌ ఖాన్‌, ఆయుష్‌ బదోనిని జట్టుతోనే కొనసాగిస్తున్నామన్నారు. ఈ మొత్తం ప్రాసెస్‌ను జహీర్‌ఖాన్‌, జస్టిన్‌ లాంగర్‌ కలిసి పర్యవేక్షించారని పేర్కొన్నారు. గత సీజన్‌లోని ముగ్గురు భారతీయ బౌలర్లు మాకు అవసరం. పూరన్‌ ఎంపికలో రెండో ఆలోచన లేదని తెలిపారు. ఇక, 6, 7 స్థానాల్లో ఆయుష్‌ మాకు బాగా ఉపయోగపడ్డాడని చెప్పుకొచ్చారు. ఇక, వ్యక్తిగత లక్ష్యాలు అంటూ సంజీవ్‌ గొయెంకా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కేఎల్‌ రాహుల్‌ను ఉద్దేశించి చేసినవే అని పేర్కొంటున్నారు.

Read Also: Gun Missfire: అనంతపురం కలెక్టరేట్‌లో వెపన్ మిస్ ఫైర్!

ఇక, కేఎల్‌ రాహుల్‌ నిస్వార్థంగా టీమ్ కోసం ఆడే ప్లేయర్.. అతడిని మాత్రం వదిలేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గొయోంకా ప్లేయర్స్ తో మాట్లాడే విధానం మార్చుకోవాలంటూ మరో యూజర్ పేర్కొన్నారు. అయితే, గత ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో మ్యాచ్‌ తర్వాత సంజీవ్‌-కేఎల్‌ రాహుల్ మధ్య గొడవ జరిగింది. అది కాస్తా లైవ్‌లో ప్రసారమైంది. ఆ తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో చాలా మంది సంజీవ్ గొయెంకా తీరును తప్పుపట్టారు. కెప్టెన్‌తో గ్రౌండ్ లో వాదనకు దిగడం సరికాదన్నారు. ఆ తర్వాత గొయెంకా కూడా వివరణ ఇచ్చారు.

Show comments