Site icon NTV Telugu

KL Rahul: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

Kl

Kl

KL Rahul: స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసేశాడు. కోహ్లీ 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకోగా.. రాహుల్ కేవలం 224 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు.

Read Also: RR vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. మళ్లీ ఓడిన రాజస్థాన్

ఇక, ఐపీఎల్ 2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లోనే కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించాడు. అయితే, ఓవరాల్ గా ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ (221 ఇన్సింగ్స్), పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ (218) మొదటి వరుసలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లీ, పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.

Exit mobile version