IPL 2024 KKR vs SRH Qualifier 1 Match Prediction: ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. నేరుగా అర్హత సాధించేందుకే ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. రెండు టాప్ జట్లు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం.
2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉంది. అదే ఊపులో టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హేన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠిలతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ముఖ్యంగా హెడ్, అభిషేక్ చెలరేగి ఆడుతున్నారు. ఈ జోడి మరోసారి చెలరేగితే విజయం ఖాయం. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌తో కూడిన సన్‌రైజర్స్ బౌలింగ్ దళం సమష్టిగా రాణిస్తోంది.
మరోవైపు కోల్‌కతా కూడా పటిష్టంగానే ఉంది. ఈ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన కోల్‌కతా.. ఏకంగా 9 విజయాల్ని సాధించింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్.. రెండో క్వాలిఫయర్ దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రసెల్ వంటి వారితో కోల్‌కతా బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. అయితే కీలక బ్యాటర్ ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లిపోవడం కోల్‌కతాకు ప్రతికూలాంశమే. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్‌లతో బౌలింగ్ కూడా బాగుంది.
Also Read: Live-In Partner: లివ్-ఇన్ పార్ట్‌నర్‌ని సోదరుడి సాయంతో చంపేసిన మహిళ..
జట్లు (అంచనా):
హైదరాబాద్: హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్.
కోల్‌కతా: నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్) రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్.