NTV Telugu Site icon

KKR vs SRH: అతడే మమ్మల్ని దెబ్బ కొట్టాడు: పాట్ కమిన్స్

Pat Cummins

Pat Cummins

SRH Captain Pat Cummins Said KKR bowled fantastically in IPL 2024 Final: ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ తమను దెబ్బకొట్టాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సారథి పాట్ కమిన్స్ తెలిపాడు. కోల్‌కతానైట్‌ రైడర్స్‌ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ వేశారని ప్రశంసించాడు. చెన్నై పిచ్ 200 ప్లస్ వికెట్ కాదని, 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌ రేసులో ఉండేవాళ్లమన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దాంతో కోల్‌కతా ఖాతాలో మూడో ఐపీఎల్ ట్రోఫీ చేరింది.

మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. దురదృష్టవశాత్తు నా సహచరుడు మిచెల్ స్టార్క్‌ మరోసారి విజృంభించాడు. ఈరోజు మేం అనుకున్న విధంగా ఆడలేకపోయాం. కొన్ని బౌండరీలను కొట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. అహ్మదాబాద్‌లో గత వారం మాదిరిగానే.. వారు బాగా బౌలింగ్ చేశారు. ఈ విజయం పూర్తి క్రెడిట్ బౌలర్లదే. ఇది మంచి బౌలింగ్ వికెట్. 200 ప్లస్ వికెట్ కాదు. మేం 160 పరుగులు చేసి ఉంటే రేసులో ఉండేవాళ్లం’ అని అన్నాడు.

Also Read: KKR vs SRH: ముందుగా బౌలింగ్‌ చేయడం కలిసొచ్చింది.. సన్‌రైజర్స్‌కు థ్యాంక్స్‌: శ్రేయస్‌ అయ్యర్

‘ఈ సీజన్‌లో మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. కుర్రాళ్లు తమ సత్తాను నిరూపించుకొనేందుకు ఉత్సాహం చూపారు. 250 పైగా స్కోర్లను మేం మూడుసార్లు సాధించాం. అంటే మా బ్యాటర్ల ఆటతీరు ఏ స్థాయిలో ఉందోఅర్ధమచేసుకోవచ్చు. తీవ్ర ఒత్తిడిలోనూ పోరాటపటిమ చూపించాం. భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, జయ్‌దేవ్ ఉనద్కత్ వంటి బౌలర్లతో పని చేయడం చాలా బాగుంది. ఇలాంటి పెద్ద టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి సంవత్సరం మరింత మెరుగ్గా ఐపీఎల్ జరుగుతుంది’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఫైనల్‌లో స్టార్క్ 3 ఓవర్లలో రెండు వికెట్స్ తీసి 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.