Site icon NTV Telugu

Shreyas Iyer: ఈ ఓటమిని ఊహించలేదు.. చాలా బాధగా ఉంది: శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Interview

Shreyas Iyer Interview

KKR Captain Shreyas Iyer Says This game a bitter pill to swallow: రాజస్తాన్‌ రాయల్స్‌పై ఓటమిని తాము అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్‌ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని, మాటలు రావడం లేదని భావోద్వేగానికి గురయ్యాడు. సునీల్ నరైన్‌ జట్టుకు గొప్ప ఆస్తి అని, అతను ప్రతి గేమ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించాడు. జోస్ బట్లర్ తన హిట్టింగ్‌తో తమ ఓటమిని శాసించాడని శ్రేయస్ తెలిపాడు. బట్లర్ (107 నాటౌట్‌; 60 బంతుల్లో 9×4, 6×6) చెలరేగడంతోరాజస్థాన్‌ 2 వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించింది. లక్ష్యాన్ని రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మ్యాచ్ అనంతరం కోల్‌కతా నైట్‌ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘ఈ ఓటమిని తాము అస్సలు ఊహించలేదు. ఓడిపోయామనే విషయం జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. మాకు ఈ పరిస్థితికి వస్తుందని అనుకోలేదు. ఇది ఓ ఫన్నీ గేమ్. ఇలాంటి పరిస్థితుల్లో విజయం సాధించాలంటే అద్భుత బంతులను వేయాలి. ఈ మ్యాచ్‌లో మేం అదే తప్పిదం చేశాం. టోర్నీ చివరలో కాకుండా ఇప్పుడే ఇలాంటి ఫలితం ఎదురవ్వడం సంతోషంగా ఉంది. ఈ ఓటమి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం. సునీల్ నరైన్‌ జట్టుకు గొప్ప ఆస్తి. అతను ప్రతి గేమ్‌ను బాగా ఆడుతున్నాడు. అతను మా బృందంలో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నా’ అని అన్నాడు.

Also Read: Jos Buttler Century: కోహ్లీ, నరైన్‌ సెంచరీలకు విలువ లేకుండా చేసిన బట్లర్‌!

‘జోస్ బట్లర్ బాగా ఆడాడు. బంతిని క్లీన్‌గా హిట్ చేశాడు. పేస్ బౌలింగ్‌ను సునాయసంగా ఆడుతున్నాడని.. చివరి ఓవర్‌ను వరుణ్ చక్రవర్తీకి ఇచ్చా. సర్కిల్ లోపల ఐదుగురు ఫీల్డర్లు ఉన్నప్పుడు అధిక ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ సరైన బంతులు వేయాలనే ఆలోచన బౌలర్‌కు ఉండదు. తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని పుంజుకోవడం ముఖ్యం. ఫలితం ఎలా ఉన్నా మా ప్లేయర్స్ ఆట గురించి గర్వపడుతున్నాను. మాకు కొన్ని రోజుల విరామం దొరికింది. తదుపరి మ్యాచ్ కోసం సిద్దమవుతాం’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version