Site icon NTV Telugu

RCB Vs KKR: ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన కేకేఆర్

Kkr Vs Rcb

Kkr Vs Rcb

RCB Vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 పున ప్రారంభానికి వ‌రుణుడు భారీ షాక్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు చేయబడింది. దీంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో టాస్ ప‌డ‌కుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: OG : ఓజీ కోసం ముంబైకి పవన్..?

అయితే, రెండు జట్లకు చెరో పాయింట్ ల‌భించింది. దీంతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్లే ఆఫ్స్ ఆశ‌లు గల్లంతు అయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిల‌వాలంటే ఆర్సీబీపై క‌చ్చితంగా గెల‌వాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఏకంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా కోల్‌క‌తా నిష్ర్కమించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో ఈ క్యాష్ రిచ్ లీగ్ నుచి ఇంటిముఖం పట్టింది.

Read Also: Off The Record: తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం అందరినీ సంతృప్తి చేయలేకపోతుందా? ఇబ్బంది పెడుతున్న ఆ అంశం ఏంటి

కాగా, ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరడంతో 17 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగ‌ళూరు జ‌ట్టు మరో అడుగు దూరంలో ఉంది. లాస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో విజయం సాధిస్తే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒక‌వేళ ఓడిపోయినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్స్ ఉంది. అయితే, ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

Exit mobile version