Site icon NTV Telugu

KKR vs RCB: కేకేఆర్ టార్గెట్ 183 పరుగులు.. రాణించిన విరాట్ కోహ్లీ

Rcb

Rcb

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కోల్ కతా ముందు ఓ ఫైటింగ్ స్కోరును నమోదు చేశారు. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా రాణించాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 4 ఫోర్లు ఉన్నాయి.

Chandrababu: వింజమూరు ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

డుప్లెసిస్ (8), గ్రీన్ (33), మ్యాక్స్ వెల్ (28) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆ తర్వాత రజత్ పాటిదర్ (3), అనుజ్ రావత్ (3) పరుగులు చేశారు. దినేష్ కార్తీక్ (20) పరుగులు చేశాడు. ఇక.. కేకేఆర్ బౌలింగ్ లో హర్షిత్ రాణా, రస్సెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ ఒక వికెట్ తీశాడు.

Exit mobile version