NTV Telugu Site icon

KKR vs SRH: ఈ విజయం వారిదే.. ఫైనల్‌లో మా బెస్ట్ ఇస్తాం: శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Kkr

Shreyas Iyer Kkr

Shreyas Iyer Says Iam extremely happy with the KKR Performances: బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే తాము క్వాలిఫయర్-1లో విజయం సాధించామని కోల్‌కతా నైట్‌ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. కోల్‌కతా జట్టు ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చిందని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చుతున్నారన్నారు. రెహ్మానుల్లా గుర్బాజ్‌, వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాదించింది.

మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చుతున్నారు. కోల్‌కతా ప్లేయర్స్ ఒకరికొకరు అండగా ఉంటున్నారు. ఫైనల్‌కు చేరడంతో చాలా సంతోషంగా ఉన్నాము. ఐపీఎల్ సుదీర్ఘ టోర్నీ కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. ప్రస్తుత కాలంలో ఉండటం ముఖ్యం. ఈ రోజు మేం అదే చేశాం. మైదానంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నాం. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు మా బౌలర్లు బౌలింగ్ చేశారు. వారు వికెట్లు తీసిన తీరు అద్భుతం. మా బౌలర్లు వికెట్లు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని చెప్పాడు.

Also Read: KKR vs SRH: అదే మా కొంప‌ముంచింది: ప్యాట్ కమిన్స్

‘బౌలింగ్ లైనప్‌లో విభిన్నత ఉంటే.. చాలా బాగుంటుంది. కెప్టెన్ పని కూడా ఈజీ అవుతోంది. మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇదే జోరును ఫైనల్లో కూడా కొనసాగిస్తాం. రెహ్మానుల్లా గుర్బాజ్‌కు ఇదే తొలి మ్యాచ్. అయినా అతడు అద్భుత ఆరంభాన్ని అందించాడు. అదే రన్ రేట్‌ను మేం కొనసాగించాం. నాకు తమిళం రాదు కానీ అర్థమవుతోంది. వెంకటేశ్ అయ్యర్ తమిళంలో మాట్లాడితే.. నేను హిందీలో జవాబిస్తాను. మా మధ్య మంచి బాండ్ ఉంది. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో మా బెస్ట్ ఇస్తాం’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

Show comments