Kolkata Knight Riders: కోల్‌కతా పంట పండింది.. శ్రేయస్ స్థానంలో ఆ స్టార్ ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jason Roy Replace Shreyas Iyer In IPL: వెన్ను సమస్య కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికే దూరమైన సంగతి తెలిసిందే! దీంతో.. నితీశ్ రానాను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. కానీ.. శ్రేయస్ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఇప్పుడు ఈ మిస్టరీకి తెరదించుతూ.. జేసన్ రాయ్‌ని రంగంలోకి దింపారు. ఇది కేకేఆర్ జట్టుకి నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. జేసన్ రాయ్ ఒక విధ్వంసకర బ్యాటర్. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే మాత్రం.. ప్రత్యర్థి జట్టుకి ఇక దబిడిదిబిడే! అఫ్కోర్స్.. ఐపీఎల్లో అతడు ఇంతవరకూ తనదైన విశ్వరూపం చూపించలేదు కానీ, నిలకడగా రానిస్తే మాత్రం రచ్చరచ్చే. ఇప్పటివరకూ ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. 129 స్ట్రైక్ రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Hardik Pandya: రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు
Also Read
- Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
అయితే.. ఇదే సమయంలో కేకేఆర్ ఓ ఎదురుదెబ్బ కూడా తగిలింది. కీలక ఆటగాడు షకీబ్ అల్ హసన్ సీజన్ మొత్తానికే అందుబాటులో ఉండడం లేదని బాంబు పేల్చాడు. అంతర్జాతీయంగా కమిట్మెంట్లు ఉండటంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల తనకు ఐపీఎల్-2023కు అందుబాటులో ఉండటం కుదరదని షకీబ్ పేర్కొన్నాడు. అతనితో పాటు బంగ్లాదేశ్‌కి చెందిన లిటన్ దాస్ కూడా ఏప్రిల్ 10వ తేదీ వరకూ అందుబాటులో ఉండట్లేదు. ఐర్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా.. తనకు 10వ తేదీ వరకు గడువు ఇవ్వా్ల్సిందిగా ఫ్రాంచైజీని కోరాడు. ఇదిలావుండగా.. నితీశ్ రానా సారథ్యంలో కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడింది. అయితే.. డవ్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!