Virat Kohli Injury: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!! మ్యాచ్‌కు ముందు కోహ్లీకి ఏమైందో చూడండి..(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Injury: నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఇంతలో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాకింగ్ వార్త వచ్చింది! మ్యాచ్‌కు ముందు జరిగిన శిక్షణా సెషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కనిపించాడు. అయితే.. విరాట్ తన కాలికి పెద్ద బ్యాండేజ్ వేసుకుని ఉండటం అభిమానులను కలవరపెట్టింది. లక్నో సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసిన ఓ వీడియోలో విరాట్ ఎల్‌ఎస్‌జీ ఎల్‌ఎస్‌జీ సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు కేన్ విలియమ్సన్, కెప్టెన్ రిషబ్ పంత్‌ను కలిసి ముచ్చటించడం కనిపించింది. ఈ వీడియోలో విరాట్ కాలికి పెద్ద బ్యాండేజ్ కనిపించింది. కోహ్లీ కాలికి లేదా చీలమండకు గాయం అయ్యిందనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. గాయం అయినప్పటికీ విరాట్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం కాస్త ఊరటనిస్తోంది.
READ MORE: Astrology: ఏప్రిల్ 15, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు సూపర్ న్యూస్ వింటారు..!
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 59.66 సగటుతో 162.72 స్ట్రైక్ రేట్‌తో 179 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 69 పరుగులు స్కోర్ చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కూడా కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాకపోతే, ఆ మ్యాచ్‌లో విరాట్ తన సహజసిద్ధమైన శైలిలో ఫ్లూయెంట్‌గా ఆడలేకపోయాడు. అంతేకాకుండా, ముంబై ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ ఫీల్డింగ్‌కు రాకుండా జాకెట్ వేసుకుని బయటే కూర్చోవడం గమనార్హం. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి తర్వాత, ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచి ఆర్సీబీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం విరాట్ గాయం తీవ్రత ఎంత అనేది తెలియాల్సి ఉంది. లక్నోతో మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆర్సీబీ అవకాశాలపై ప్రభావం చూపనుంది.
Yaari dosti 🥹🤌 pic.twitter.com/lgdcrCTITI
— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2026
తాజావార్తలు
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!