Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్‌లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’

Sfdsdfsadf

Sfdsdfsadf

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై అతను ఆడిన ఇన్నింగ్స్‌లు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ, 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.

సూర్యవంశీ బ్యాటింగ్‌పై సన్‌రైజర్స్ స్టార్, ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను తన కెరీర్‌లో ఇలాంటి బ్యాటర్‌ను ఎప్పుడూ చూడలేదంటూ సూర్యవంశీ టైమింగ్, డెవలప్‌మెంట్‌ను కొనియాడాడు.

×
×
Ad

“మేము ‘సూర్యవంశీ’ వేగానికి బలయ్యాం. ఓ మై గాడ్! టోర్నమెంట్ ప్రారంభంలో అతడిని బౌన్సర్లతో త్వరగానే అవుట్ చేశాం. కానీ ఆ తర్వాత అతను మాపైనే ఒక సెంచరీ, ఒక 97 పరుగులు బాదాడు.”
— ‘స్టిక్ టు క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో లివింగ్‌స్టోన్

లివింగ్‌స్టోన్ మాట్లాడుతూ.. “నేను ఇప్పటివరకు ఏడు ఐపీఎల్ సీజన్లు ఆడాను. ఎంతోమంది గొప్ప ఆటగాళ్లతో, వారిపై ఆడాను. కానీ ఇలాంటి విన్యాసాన్ని ఎప్పుడూ చూడలేదు. అతను బంతిని హిట్ చేసే విధానం చాలా క్లీన్‌గా ఉంటుంది. టోర్నమెంట్ మొత్తం మీద అతను ఒక్క బంతిని కూడా మిస్-హిట్ చేయలేదు. టోర్నమెంట్ ప్రారంభం నుండి చివరి వరకు ఒక ప్లేయర్‌గా అతను సాధించిన ఎదుగుదల అద్భుతం. మేము బౌన్సర్లు వేస్తే థర్డ్-మన్ మీదుగా సిక్సర్లు కొట్టాడు, లో-ఫుల్ టాస్ వేస్తే ఫ్లిక్ చేస్తూ బౌండరీలు దాటించాడు” అని వివరించాడు.

రికార్డుల వేట.. ఐపీఎల్ 2026 హీరో.. 
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌ను అత్యంత అద్భుతంగా ముగించాడు. అతను ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 237 పైగా స్ట్రైక్-రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఒకే ఐపీఎల్ సీజన్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యవంశీ ఐదో స్థానంలో నిలిచాడు. అంతేకాదు, ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడుతూ.. ఏకంగా 72 సిక్సర్లు బాదాడు.

ఈ అసాధారణ ప్రదర్శనకు గాను, ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్‌లో సూర్యవంశీ ఏకంగా ఐదు అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఇందులో అత్యధిక పరుగులు చేసినందుకు ఇచ్చే ‘ఆరెంజ్ క్యాప్’ తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (MVP) అవార్డు కూడా ఉన్నాయి.

మరోవైపు.. ఈ సీజన్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ మాత్రం కేవలం రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. సూర్యవంశీ ఆటతీరు చూస్తుంటే.. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ‘అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడి’ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడని బీసీసీఐ వర్గాల అంచనా.