Site icon NTV Telugu

Longest IPL Match: “4 గంటల 23 నిమిషాలు”.. ధురందర్ 2 కంటే ఎక్కువ సేపు సాగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే..

Rcb Vs Mi Longest Ipl Match

Rcb Vs Mi Longest Ipl Match

Longest IPL Match Without A Super Over: టీ20 ఫార్మాట్ అంటేనే వేగం.. ఐపీఎల్‌లో వేగం ఇంకా పెరుగుతోంది. కొన్ని గంటల్లోనే ఫలితం తేలిపోతుంది. కానీ ఐపీఎల్‌లోని ఒక మ్యా్చ్ మాత్రం గంటల తరబడి సాగింది. అదేదో కాదు.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్. అసలు సూపర్ ఓవర్ లేకుండానే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఇంత సుదీర్ఘంగా సాగడం టోర్నీ చరిత్రలోనే ఇదే తొలిసారి. రాత్రి 7 గంటలకు టాస్‌తో మొదలైన ఈ హై-వోల్టేజ్ డ్రామా, చివరి బంతి పడేసరికి రాత్రి 11:45 దాటిపోయింది. అంటే సుమారు 4 గంటల 23 నిమిషాల పాటు సాగింది. ఇక ఈ మ్యాచ్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య సోషల్ మీడియాలో సెటైరికల్‌గా స్పందించారు. సుమారు మూడు గంటల యాభై నిమిషాల నిడివి ఉండే ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా కంటే ఈ మ్యాచే పెద్దదని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నవ్వులు పూయిస్తోంది. క్రికెట్ అభిమానులు ఈ వ్యాఖ్యపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో మొత్తం 4 ఎక్స్‌ట్రాలు (Extras) వచ్చాయి (1 బై, 3 వైడ్లు). ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 ఎక్స్‌ట్రాలు (Extras) వచ్చాయి (1 బై, 1 లెగ్ బై, 13 వైడ్లు). వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం వేడి వాతావరణం, సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులని నిపుణులు చెబుతున్నారు. అదనంగా, టాస్ సమయంలో సాంకేతిక సమస్యలు, ఇరు జట్ల కెప్టెన్లు క్రీజులో ఎక్కువ సమయం తీసుకోవడం కూడా కొంతవరకు ఆలస్యానికి కారణమైంది.

READ MORE: Astrology: ఏప్రిల్‌ 14, మంగళవారం దినఫలాలు.. మీది ఈ రాశా..? అయితే కాస్త జాగ్రత్త..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ సుదీర్ఘ పోరాటంలో చివరకు ఆర్సీబీదే పైచేయి అయింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించిన బెంగళూరు, ఈ మైదానంలో తన అత్యధిక స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లు ముంబై బౌలర్లను చీల్చిచెండాడారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 36 బంతుల్లో 78 పరుగులతో విరుచుకుపడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిస్తే, కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 20 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. ముఖ్యంగా పాటిదార్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబైని కట్టడి చేయడంలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా (1/26), సుయాష్ శర్మ (2/47) కీలక పాత్ర పోషించారు.

Exit mobile version