Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంపై ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ విజయంపై మాల్యా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. “ఆర్సీబీ.. ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచినందుకు అభినందనలు. మన పెద్ద సింహాలు గర్జించి మనందరినీ గర్వపడేలా చేశాయి” అని పోస్ట్ చేశారు. ముంబై, చెన్నై తర్వాత వరుసగా రెండుసార్లు కప్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది.
RCB RCB….Congratulations Double back to back IPL Champions. Namma dodda Simhagulu roared loudly and made us all very proud. Very well done you beauties.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
— Vijay Mallya (@TheVijayMallya) May 31, 2026
గత ఏడాది ఆర్సీబీ గెలిచినప్పుడు జరిగిన తొక్కిసలాట ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి బెంగళూరులో ఎలాంటి రోడ్ షో లేదా విజయ యాత్ర నిర్వహించకూడదని మేనేజ్మెంట్ నిర్ణయించింది. గత ఏడాది జరిగిన చేదు అనుభవాన్ని పునరావృతం కానివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అదే రోజు చిన్నస్వామి స్టేడియం సమీపంలోని లోక్ భవన్లో జరగనుంది. సీఎం ప్రమాణ స్వీకారానికి భారీగా జనం, ప్రముఖులు వస్తుండటంతో పోలీసులకు భద్రత కల్పించడం సవాలుగా మారింది. అందువల్ల నగర వీధుల్లో బహిరంగ వేడుకలు జరపకూడదనే పోలీసుల నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!