Site icon NTV Telugu

IPL Match Fixing: “5 మ్యాచ్‌ల్లో 42 రన్స్.. కావాలనే ఇలా చేస్తున్నాడు?”.. స్టార్ బ్యాటర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు!!

Nicholas Pooran

Nicholas Pooran

IPL Match Fixing: ఐపీఎల్‌లో ప్లేయర్స్ ప్రతిభ కనిపిస్తుంది. చాలా మంది ప్లేయర్స్ తమ ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తారు. కొందరు స్టార్ ప్లేయర్స్ రాణించలేకపోతారు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతారు. ఇలాగే.. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ వరుస వైఫల్యాలు ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ మరోసారి విఫలమయ్యాడు. అభిమానులకు ఏకంగా మ్యాచ్ ఫిక్సింగ్ (Match-fixing) ఆరోపణలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో లక్నో ఇప్పటివరకు రెండు విజయాలు సాధించినప్పటికీ, అవి బౌలర్ల పుణ్యమేనని, బ్యాటర్లు మాత్రం జట్టును నిట్టనిలువునా ముంచుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

READ MORE: Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్‌ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!

ముఖ్యంగా ఎల్‌ఎస్‌జీలో నికోలస్ పూరన్ ఫామ్ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన పూరన్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లలో 175-200 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను భయపెట్టిన పూరన్, ఇప్పుడు కనీసం 80 స్ట్రైక్ రేట్ సైతం నమోదు చేయలేకపోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 7 బంతులు ఎదుర్కొన్న పూరన్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగులు రాకపోవడం ఒక ఎత్తయితే, కనీసం పరుగులు చేయాలనే కసి (Intent) కూడా అతనిలో కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

READ MORE: Josh Hazlewood: వైభవ్ సూర్యవంశీ దెబ్బకు అల్లాడిపోయా.. లక్నోపై మంచి రిథమ్ అందుకున్నా!

అయితే, ఈ వైఫల్యాల వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. గత సీజన్‌లో మూడో స్థానంలో (No.3) బ్యాటింగ్ చేసి అదరగొట్టిన పూరన్‌ను కాదని, ఈసారి కెప్టెన్ రిషబ్ పంత్ ఆ స్థానంలో వస్తున్నాడు. తన స్థానాన్ని పంత్ లాక్కున్నాడనే అసంతృప్తితోనే పూరన్ కావాలని సరిగ్గా ఆడటం లేదని (Intentionally underperforming) కొందరు అభిమానులు ఆరోపిస్తున్నారు. పంత్ నిర్ణయం తప్పు అని నిరూపించేందుకే పూరన్ ఇలా చేస్తున్నాడని, అతని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మానసికంగా కృంగిపోయినట్లు కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతుందో పురన్‌కే తెలియాలి.

Exit mobile version