Site icon NTV Telugu

GT vs MI: సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

Tilak Varma

Tilak Varma

ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్ కు దిగింది. తిలక్ వర్మ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సులు, ఫోర్లతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. సెంచరీతో చెలరేగిన తిలక్ ముంబైకి భారీ స్కోర్ అందించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. గుజరాత్ కు 200 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆరంభం పేలవంగా ఉంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన క్వింటన్ డి కాక్ 13 పరుగులకే ఔటయ్యాడు. అరంగేట్రం చేసిన డానిష్ కూడా కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమై, కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, తిలక్ వర్మ, నమన్ ధీర్ అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 13వ ఓవర్‌లో నమన్ ధీర్ 45 పరుగుల వద్ద ఔటవడంతో ముంబైకి నాలుగో దెబ్బ తగిలింది. నమన్ తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

Exit mobile version