Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..

Venkatesh Iyers

Venkatesh Iyers

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే ఇదే అత్యంత వేగవంతమైన టీమ్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు 2023లో ఇదే అహ్మదాబాద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 4 ఓవర్లలో 50 పరుగులు సాధించిన రికార్డును కోహ్లీ, అయ్యర్ జోడి బద్దలు కొట్టింది.

మొదటిసారి ఓపెనింగ్ పార్టనర్‌షిప్.. అరుదైన రికార్డు:
ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించడం ఇదే మొదటిసారి. తొలి మ్యాచ్‌లోనే ఈ జోడి అద్భుతమైన సమన్వయంతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుట్ అవ్వగా, వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 4.3 ఓవర్లలోనే 62 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ కోహ్లీ కేవలం 13 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి క్రీజులో నాటౌట్‌గా ఉన్నాడు. ఫైనల్ లాంటి హై-ప్రెజర్ మ్యాచ్‌లో తొలిసారి జతకట్టినప్పటికీ, ఈ ఓపెనింగ్ జోడి సృష్టించిన విధ్వంసం ఆర్‌సీబీకి మ్యాచ్‌పై పూర్తి పట్టును తెచ్చిపెట్టింది.

×
×
Ad