Site icon NTV Telugu

Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియో)

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah Viral Videos: జస్ప్రీత్ బుమ్రాకు ఈ ఐపీఎల్ సీజన్ అస్సలు కలిసి రావడం లేదు. వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన బుమ్రా.. ఈ ఐపీఎల్‌లో మాత్రం తడబడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. కాగా ముంబై టీమ్ సైతం గత నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించలేదు. ఈ పరిణామాల అనంతరం బుమ్రాకు సంబంధించి కొన్ని వీడియోలో సోషల్ మీడడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా, చిరునవ్వుతో కనిపించే బుమ్రా.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో విపరీతమైన అసహనానికి లోనయ్యాడు. బుమ్రా బౌలింగ్ మార్కర్‌ను కోపంతో విసిరికొట్టడమే కాకుండా, నేల వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ తన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టాడు. మరో వీడియోలో బుమ్రా నవ్వుతూ కనిపించాడు. ఈ నవ్వు సాధారణ నవ్వు కాదు.. తీవ్ర అసహనం, నిస్సహాయతతో కూడుకున్న నవ్వుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో అభిమానుల గుండెలను పిండేశాయి. గతంలో జరిగిన మ్యాచ్‌లను గుర్తు చేస్తూ కొందరు ధైర్యం చెబుతుంటే.. మరి కొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.

READ MORE: CheQ AU Credit Card: పేమెంట్ చేయగానే గ్రీన్ లైట్.. భారత్ లో మొదటి LED కో-బ్రాండెడ్ కార్డు

బుమ్రా ఎందుకు తడబడుతున్నాడు?
బుమ్రా వైఫల్యంపై ముంబై కోచ్ మహేల జయవర్ధనే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్‌ప్లేలో ఇతర బౌలర్లు వికెట్లు తీసి ఒత్తిడి పెంచకపోవడమే బుమ్రాకు ప్రతికూలంగా మారుతోందని ఆయన విశ్లేషించారు. “తొలి ఓవర్లలో వికెట్లు పడకపోవడంతో ప్రత్యర్థి బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో అనవసర రిస్క్ తీసుకోవడం లేదు. అందుకే అతనికి వికెట్లు దక్కడం లేదు” అని జయవర్ధనే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, టీ20 ప్రపంచకప్ తర్వాత బుమ్రా చిన్నపాటి గాయంతో (Niggle) బాధపడటం వల్ల సీజన్ ఆరంభంలో వేగం కాస్త తగ్గిందని, కానీ ఇప్పుడు అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని కోచ్ స్పష్టం చేశారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బుమ్రా అద్భుతమైన బంతులు వేసినప్పటికీ అదృష్టం కలిసిరాక వికెట్ దక్కలేదని, ఒక్కసారి వికెట్ల ఖాతా తెరిస్తే బుమ్రాను ఆపడం ఎవరితరం కాదని జయవర్ధనే ధీమా వ్యక్తం చేశారు. వరుస ఓటములు, వ్యక్తిగత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే బుమ్రా ఆగ్రహానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version