Site icon NTV Telugu

Jasprit Bumrah IPL Record: 276 టీ20 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!

Jasprit Bumrah Injury

Jasprit Bumrah Injury

Jasprit Bumrah Creates Rare IPL Record: జస్ప్రీత్ బుమ్రా అరుదైన బౌలర్. టాప్ ప్లేయర్లను వణికించాడు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో సీన్ రివర్స్ అయ్యింది. వికెట్లు తీయడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు. కట్‌చేస్తే.. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి వికెట్ పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఆడిన ఏడో మ్యాచ్‌లో వికెట్ తీశాడు. ఏకంగా 146 బంతుల తర్వాత తన తొలి ఐపీఎల్ వికెట్‌ను పడగొట్టడమే కాకుండా, ఆసక్తికరంగా 276 టీ20 మ్యాచ్‌ల సుదీర్ఘ నిరీక్షణకు సైతం తెరదించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బుమ్రా బంతితో మాయాజాలం చేశాడు. తన 276 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లోనే తొలిసారిగా ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ సాయి సుదర్శన్‌ను గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపి హోస్ట్ టీమ్‌కు షాక్ ఇచ్చాడు.

READ MORE: Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..?

విశేషమేమిటంటే, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆరు మ్యాచ్‌ల్లోనే మూడుసార్లు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి రికార్డు సృష్టించాడు. అయితే బుమ్రాకు ఇలాంటి అవకాశం రాకపోవడానికి ఒక కారణం ఉంది. తన సుదీర్ఘ టీ20 కెరీర్‌లో బుమ్రా కేవలం 16 సార్లు మాత్రమే బౌలింగ్ అటాక్‌ను ఆరంభించాడు. ఐపీఎల్‌లో అతను కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించడం ఇది కేవలం ఆరోసారి మాత్రమే. గణాంకాలను పరిశీలిస్తే, బుమ్రా కొత్త బంతితో ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఓపెనింగ్ బౌలర్‌గా దిగిన 16 ఇన్నింగ్స్‌ల్లో అతను 23 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు, ఓపెనింగ్ బౌలర్‌గా దిగి వికెట్ తీయకుండా వెనుదిరగడం బుమ్రా కెరీర్‌లో కేవలం రెండుసార్లు మాత్రమే జరిగింది (చివరిసారి 2014లో). ఈ గణాంకాలు చూస్తుంటే, ముంబై ఇండియన్స్ ఇకపై ప్రతి మ్యాచ్‌లోనూ బుమ్రాతోనే బౌలింగ్ ఆరంభించడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version