Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ 15 ఏళ్ల టీనేజర్.. మొత్తంగా 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ సమయంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల (59 సిక్సర్లు) రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అతను ఏకంగా 583 పరుగులు సాధించాడు.
ఇతడి బ్యాటింగ్ విన్యాసాలకు ముగ్ధులైన మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాష్ చోప్రా లైవ్ కామెంట్రీలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ గనుక ఐపీఎల్ వేలంలోకి వస్తే ఎంత ధర పలుకుతాడని హర్భజన్ సింగ్ అడగ్గా.. సెహ్వాగ్ ఏమాత్రం ఆలోచించకుండా తాను రూ. 30 కోట్లు పెట్టడానికైనా సిద్ధమేనని ప్రకటించాడు. దీనికి వెంటనే స్పందించిన ఆకాష్ చోప్రా.. తాను కూడా రెండో ఆలోచన లేకుండా అంతే మొత్తాన్ని వేలంలో ఆఫర్ చేస్తానని చెప్పడం విశేషం.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మరోవైపు ఈ అద్భుత ప్రదర్శనతో సూర్యవంశీని టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంపిక చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. వచ్చే నెలలో తిలక్ వర్మ నేతృత్వంలో శ్రీలంకతో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం భారత్-ఏ జట్టులో ఈ వండర్ కిడ్‌కు చోటు దక్కింది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ సైతం వైభవ్ సూర్యవంశీని అరుదైన ప్రతిభ గల ఆటగాడిగా అభివర్ణించారు. శారీరక నైపుణ్యంతో పాటు మానసిక దృఢత్వంపై బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నాయని, తద్వారా అతను భారత్ తరఫున సుదీర్ఘ కాలం రాణిస్తాడని ధుమాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!