Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్‌పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..

Riyan Parag

Riyan Parag

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా జరిమానాకు గురయ్యారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ వాడుతూ కెమెరాకు చిక్కడం చర్చనీయాంశమైంది. క్రీడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి ఆట ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను బీసీసీఐ ఈ చర్యలు తీసుకుంది. పరాగ్ తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ అతనికి శిక్ష ఖరారు చేశారు. రియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా, ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం.. ఆట గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం నేరం. డ్రెస్సింగ్ రూమ్‌లో వేప్ వాడటం ఈ పరిధిలోకి వస్తుంది.

కొద్దిరోజుల క్రితమే రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ కూడా నిబంధనలు అతిక్రమించి డగౌట్‌లో ఫోన్ వాడటంతో లక్ష రూపాయల జరిమానా ఎదుర్కొన్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై, అధికారులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా బీసీసీఐ ఆలోచిస్తోంది. మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణతో ఉండాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని బోర్డు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పరాగ్ వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.