RCB Vs CSK: చిన్నస్వామిలో RCB సిక్సర్ల సునామీ.. టిమ్ డేవిడ్ వీరవిహారం.. స్కోర్ ఎంతంటే..
- భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
- బౌలర్లను ఉతికి ఆరేసిన టిమ్ డేవిడ్..
- చెన్నై ముందు కొండంత టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 250/3 పరుగుల భారీ స్కోరును సాధించి చెన్నై ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ అసలైన విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఏకంగా 8 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ (50 పరుగులు, 29 బంతుల్లో) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా మెరుపులు మెరిపిస్తూ 19 బంతుల్లోనే 48 పరుగులు (6 సిక్సర్లు) సాధించాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (28), ఫిల్ సాల్ట్ (46) మంచి పునాది వేశారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ అగ్రస్థానంలో నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 280.00గా నమోదైంది. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో డేవిడ్ 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. రజత్ పాటిదార్ కూడా 252.63 స్ట్రైక్ రేట్‌తో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Also Read:Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..
చెన్నై బౌలర్లు చిన్నస్వామి పిచ్‌పై తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అన్షుల్ కాంబోజ్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా, నూర్ అహ్మద్ తన 4 ఓవర్లలో వికెట్ లేకుండా 49 పరుగులు సమర్పించుకున్నాడు. శివం దూబే 2 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి ఫిల్ సాల్ట్ వికెట్ పడగొట్టాడు. ఒక దశలో టిమ్ డేవిడ్ వికెట్‌ను కాంబోజ్ తీసినప్పటికీ, అది నో-బాల్ కావడంతో చెన్నైకి దక్కాల్సిన వికెట్ చేజారింది. ఆ తర్వాత వచ్చిన ఫ్రీ-హిట్‌ను డేవిడ్ సిక్సర్‌గా మలిచి ఆర్సీబీ స్కోరును 200 దాటించాడు. మొత్తానికి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం చెన్నైకి ఇప్పుడు పెను సవాల్‌గా మారింది. ఈ సీజన్లో ప్రస్తుతానికి ఇదే అత్యధిక స్కోర్.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!