RCB Vs CSK: టాస్ గెలిచిన CSK.. ఆర్సీబీ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 5) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హై-వోల్టేజ్ పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడం, రాత్రి సమయంలో మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో చెన్నై జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపింది. గాయం కారణంగా ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌కు దూరం కావడం సిఎస్‌కే అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తుది జట్లు ఇవే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ. (ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ)
చెన్నై సూపర్ కింగ్స్ (CSK):
సంజూ శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, మాట్ హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్. (ఇంపాక్ట్ ప్లేయర్: అన్షుల్ కాంబోజ్)
గత మూడు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సిఎస్‌కేపై వరుస విజయాలు సాధించిన ఆర్సీబీ, అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన చెన్నై, ఈ కీలక పోరుతో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉంది. కోహ్లీ, సాల్ట్ వంటి విధ్వంసకర ఓపెనర్లు ఉన్న ఆర్సీబీని కట్టడి చేయడం చెన్నై బౌలర్లకు పెద్ద సవాలే.
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!