IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆదివారం (మే 31) మహా సంగ్రామం జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని ముద్దాడే జట్టు ఎవరు అనే ఉత్కంఠ ఒకవైపు ఉంటే.. ఈసారి ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎంత ఉండబోతోంది? ఏ స్థానంలో నిలిచిన జట్టుకు ఎంత డబ్బు దక్కనుంది? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
నివేదికల ప్రకారం.. ఈ సీజన్ మొత్తం ప్రైజ్ పూల్ విలువ అక్షరాలా రూ. 46.5 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో ఫైనల్ గెలిచి ‘ఛాంపియన్’గా నిలిచే జట్టు ఏకంగా రూ. 20 కోట్ల భారీ నగదు బహుమతిని సొంతం చేసుకోనుంది. ఇక రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ. 13 కోట్లు దక్కుతాయి. కాగా.. ప్లేఆఫ్స్ చేరి క్వాలిఫైయర్-2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 7 కోట్లు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో వెనుతిరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.
Also Read
- RCB Vs GT: "అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం".. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: 'ఒక్కే ఒక్క కండీషన్..' వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్‌ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
అయితే మిగిలిన 6 జట్లకు ఈ ప్రైజ్ పూల్ నుండి ఒక్క రూపాయి కూడా దక్కదు. వారు కేవలం బ్రాడ్‌కాస్టింగ్, టికెట్ సేల్స్ ద్వారా మాత్రమే ఆదాయం పొందుతారు. మరోవైపు వ్యక్తిగత అవార్డుల విషయానికి వస్తే.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) విజేతలకు చెరో రూ. 10 లక్షలు.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌కు రూ. 20 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ (776 పరుగులు), పర్పుల్ క్యాప్ రేసులో కాగిసో రబాడ (28 వికెట్లు) ముందంజలో ఉన్నారు.
తాజావార్తలు
-
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
-
Singapore Open 2026: సింగపూర్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ జోడీ
-
RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!