IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?

Ipl 2026 Coincidences

Ipl 2026 Coincidences

ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆదివారం (మే 31) మహా సంగ్రామం జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని ముద్దాడే జట్టు ఎవరు అనే ఉత్కంఠ ఒకవైపు ఉంటే.. ఈసారి ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎంత ఉండబోతోంది? ఏ స్థానంలో నిలిచిన జట్టుకు ఎంత డబ్బు దక్కనుంది? అనే ఆసక్తికర వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

నివేదికల ప్రకారం.. ఈ సీజన్ మొత్తం ప్రైజ్ పూల్ విలువ అక్షరాలా రూ. 46.5 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో ఫైనల్ గెలిచి ‘ఛాంపియన్‌’గా నిలిచే జట్టు ఏకంగా రూ. 20 కోట్ల భారీ నగదు బహుమతిని సొంతం చేసుకోనుంది. ఇక రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ. 13 కోట్లు దక్కుతాయి. కాగా.. ప్లేఆఫ్స్ చేరి క్వాలిఫైయర్-2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ. 7 కోట్లు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో వెనుతిరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రూ. 6.5 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.

×
×
Ad

అయితే మిగిలిన 6 జట్లకు ఈ ప్రైజ్ పూల్ నుండి ఒక్క రూపాయి కూడా దక్కదు. వారు కేవలం బ్రాడ్‌కాస్టింగ్, టికెట్ సేల్స్ ద్వారా మాత్రమే ఆదాయం పొందుతారు. మరోవైపు వ్యక్తిగత అవార్డుల విషయానికి వస్తే.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) విజేతలకు చెరో రూ. 10 లక్షలు.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌కు రూ. 20 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సూర్యవంశీ (776 పరుగులు), పర్పుల్ క్యాప్ రేసులో కాగిసో రబాడ (28 వికెట్లు) ముందంజలో ఉన్నారు.