ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లీగ్ దశ ముగింపు వేళ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా ముగిసింది. వాంఖేడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో గెలుపొందడంతో రాజస్థాన్ రాయల్స్ (RR) అధికారికంగా ప్లేఆఫ్స్ బరిలోకి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో రాజస్థాన్ 8 విజయాలు, 6 ఓటములతో మొత్తం 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ విజయంతో పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి.
మే 26 (క్వాలిఫైయర్ 1): పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది.
మే 27 (ఎలిమినేటర్): పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో తలపడనున్నాయి. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.
మే 29 (క్వాలిఫైయర్ 2): క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ముల్లన్‌పూర్ వేదికగానే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తలపడుతుంది.
మే 31 (ఫైనల్): క్వాలిఫైయర్ 1 మరియు క్వాలిఫైయర్ 2 విజేతల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
