Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..

Mitchel Marsh

Mitchel Marsh

ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్  ఇన్నింగ్స్ విరామ సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ టాప్ స్కోరర్ మిచేల్ మార్ష్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, జోష్ ఇంగ్లిస్‌తో భాగస్వామ్యం మరియు పిచ్ ప్రవర్తన గురించి మాట్లాడారు. “ఇన్నింగ్స్ చివర్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేయడం ఒక రకమైన ‘టార్చర్’ లాగా అనిపించింది. చివరి ఓవర్లలో మేము అనుకున్నట్లు మరో రెండు, మూడు బౌండరీలు రాబట్టలేకపోయాము. ఒకవేళ ఆ పరుగులు వచ్చి ఉంటే ఇంకా సంతోషించేవాళ్లం. కానీ క్రెడిట్ మొత్తం రాజస్తాన్ బౌలర్లకే దక్కుతుంది. వారు మ్యాచ్‌ను చక్కగా నియంత్రించి, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశారు.”

“గడిచిన ఐదేళ్లలో క్రికెట్ చాలా మారిపోయింది. ఒక ఐదేళ్ల క్రితం 220 పరుగులు చేస్తే.. చేతిలో డిఫెండ్ చేయడానికి మంచి స్కోరు ఉందని చాలా నమ్మకంతో మైదానం వీడేవాళ్లం. కానీ ఈ రోజుల్లో ఈ స్కోరు సరిపోదు. ఈ రాత్రి మేము మ్యాచ్ గెలవాలంటే మా ప్లాన్స్‌ను కచ్చితత్వంతో అమలు చేస్తూ చాలా బాగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇక జోష్ ఇంగ్లిస్‌తో నా భాగస్వామ్యం విషయానికి వస్తే.. మేము ఇద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడాము. అతని బ్యాటింగ్ శైలి నాపై ఉన్న ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. మా ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. ఈ రోజు మేము నెలకొల్పిన భాగస్వామ్యం జట్టును విజయతీరాలకు చేరుస్తుందని ఆశిస్తున్నాను.”

పిచ్ గురించి బౌలర్లకు ఇచ్చిన సలహా..
“ఇది బ్యాటింగ్‌కు చాలా అనుకూలమైన అద్భుతమైన వికెట్. ఇక్కడ మంచి బంతులు కూడా ఫోర్లు, సిక్సర్లుగా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి బౌలర్లకు ‘ఎగ్జిక్యూషన్’ చాలా ముఖ్యం. బౌలింగ్ రన్-అప్ స్టార్ట్ చేసే ముందే ఏ బంతి వేయాలనే దానిపై బౌలర్ పూర్తి స్పష్టతతో ఉండాలి. అప్పుడే ఈ పోరులో నిలబడగలం.”

తన రనౌట్ గురించి మాట్లాడుతూ.. అది కేవలం దురదృష్టం మాత్రమే అని.. ఒక్కోసారి ఆటలో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి.. సెంచరీ మిస్ అయిందన్న బాధ లేదు.. దాని గురించి అస్సలు ఆలోచించలేదని అన్నారు.