Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన పోరులో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ బౌలర్లు అవలంబించిన ‘బాడీలైన్ బౌలింగ్’ (ఆటగాడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌన్సర్లు వేయడం) వ్యూహంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ స్టార్ ఫాస్ట్ బౌలర్లు కాగిసో రబడా, మహమ్మద్ సిరాజ్ వేసిన బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొంటూ కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. 204.26 స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ జట్టు 214 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ ఇన్నింగ్స్ సమయంలో అతడిని కట్టడి చేయడానికి గుజరాత్ బౌలర్లు వరుసగా బాడీలైన్ బౌన్సర్లతో టార్గెట్ చేశారు. అయితే వైభవ్ మునుపటి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు అనేది మాత్రం వాస్తవం. గుజరాత్ పై అంత దూకుడుగా ఆడలేకపోయాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
దీనిపై ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “15 ఏళ్ల చిన్న పిల్లాడైన వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడానికి అంతలా బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అతడు పెద్ద ఆటగాళ్లతో పోటీపడుతున్నాడని నాకు తెలుసు, కానీ నాలోని తండ్రి మనసు మాత్రం దీనిని అంగీకరించలేకపోతోంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ అద్భుతంగా ఆడినప్పటికీ రాజస్థాన్ రాయల్స్‌కు విజయం దక్కలేదు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 104 పరుగులతో సెంచరీతో చెలరేగడం, సాయి సుదర్శన్ (58) రాణించడంతో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ ఐదేళ్లలో మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!