GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన PBKS..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తడబడిన పంజాబ్ బ్యాటర్లు..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (2), ప్రభ్సిమ్రాన్ సింగ్ (15) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. వన్ డౌన్లో వచ్చిన కూపర్ కానోలీ డకౌట్ కాగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 19 పరుగులకే వెనుదిరిగాడు. ఒక దశలో పంజాబ్ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు.
సూర్యాన్ష్, స్టోయినిస్ పోరాటం..
మధ్యలో సూర్యాన్ష్ షెడ్జ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. కేవలం 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 57 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అతనికి తోడుగా మార్కస్ స్టోయినిస్ (40 పరుగులు; 31 బంతుల్లో) బాధ్యతాయుతంగా ఆడాడు. చివర్లో మార్కో జాన్సెన్ 11 బంతుల్లో 20 పరుగులు చేయడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
గుజరాత్ బౌలింగ్ అద్భుతం..
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ అత్యద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ చెరో రెండు వికెట్లతో పంజాబ్ వెన్ను విరిచారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాలంటే 164 పరుగులు చేయాల్సి ఉంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నందున, గుజరాత్ ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..