Axar Patel: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. ఢిల్లీ చారిత్రక విజయంపై అక్షర్ పటేల్ ఫుల్ హ్యాపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axar Patel: సోమవారం (మే 11) ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ.. ఈ మైదానంలో అత్యధిక టీ20 ఛేదనను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఓటమితో పంజాబ్‌కు వరుసగా ఇది నాలుగో ఓటమి కాగా, ఢిల్లీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మ్యాచ్ అనంతరం తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో జట్టు సభ్యులు బాధ్యతాయుతంగా ఆడి విజయాన్ని అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా తాము తడబడుతున్నామని, అయితే ఈ మ్యాచ్‌లో ఆ లోపాన్ని అధిగమించామని అక్షర్ పేర్కొన్నాడు. తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని మొదటి నుంచీ చెబుతున్నానని గుర్తు చేశాడు. సుదీర్ఘమైన టోర్నమెంట్లో కొన్నిసార్లు ఒకటి రెండు క్షణాలే ఫలితాన్ని మారుస్తుంటాయన్నాడు. కానీ ఈరోజు జట్టు ఆడిన తీరు చాలా సంతోషాన్నిచ్చిందని వెల్లడించాడు.
తొలి 3-4 ఓవర్లలో బౌలింగ్‌లో 60 పరుగులు సమర్పించుకున్నప్పటికీ, ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని అక్షర్ కొనియాడాడు. ముకేష్ కుమార్, మాధవ్ తివారీ మధ్య ఓవర్లలో బౌలింగ్ చేసిన తీరు రాజస్థాన్ మ్యాచ్‌ను గుర్తుకు తెచ్చిందన్నాడు. అది మ్యాచ్‌లో అతిపెద్ద మలుపు అని తెలిపాడు. ఇక బ్యాటింగ్‌లో డేవిడ్ మిల్లర్‌తో నా భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను సెట్ చేయగా, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ వంటి కుర్రాళ్లు మ్యాచ్‌ను అద్భుతంగా ముగించారని వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం వెనుక ఉన్న వ్యూహాన్ని వివరించాడు. “ఈరోజు వికెట్ భిన్నంగా స్పందించింది. ముఖ్యంగా ఆకిబ్ నబీ బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి స్వింగ్ అవ్వడమే కాకుండా సీమ్ కూడా అవుతోందని గ్రహించాను. పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభిస్తున్నప్పుడు స్పిన్నర్ల అవసరం లేదనిపించింది. అందుకే మాధవ్, ఆకిబ్లకు అదనపు ఓవర్లు ఇచ్చాను” అని స్పష్టం చేశాడు. ఒకవేళ మాధవ్ తివారీ పరుగులు సమర్పించుకుని ఉంటే, తాను బౌలింగ్‌కు వచ్చేవాడినని, అయితే బ్యాకప్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నా.. మైదానంలో పేసర్లు సక్సెస్ అవ్వడం జట్టుకు కలిసి వచ్చిందని అక్షర్ చెప్పుకొచ్చాడు. ఇక పంజాబ్‌పై సాధించిన ఈ విజయం ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలోపేతం చేసింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!