Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajinkya Rahane: నిన్న(బుధవారం) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉత్కంఠభరితంగా విజయం సాధించి, తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కోల్‌కతా ఏడు బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా మ్యాచ్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్యా రహానే తన మనసులోని మాటలను పంచుకున్నాడు. “వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత జట్టులో వాతావరణం చాలా భారంగా మారింది. అలాంటి క్లిష్ట సమయంలో మేమంతా కూర్చుని చాలా నిజాయితీగా, బాహాటంగా చర్చించుకున్నాం. నిజానికి మేము అప్పటివరకు బాగానే ఆడుతున్నా, మ్యాచ్‌ను మలుపు తిప్పే కీలక క్షణాలను చేజార్చుకున్నాం. అయితే, ఆ సిరీస్ ఓటముల తర్వాత వచ్చిన చిన్న విరామం (బ్రేక్), ఆ తర్వాతి మ్యాచ్‌లో సాధించిన విజయం మా జట్టు రూపురేఖలనే మార్చేశాయి. ఆ ఒక్క గెలుపుతో జట్టులో సరికొత్త జోష్ వచ్చింది, అందరిలో నమ్మకం పెరిగింది. నిజానికి ఆటగాళ్లలో నమ్మకం ఎప్పుడూ ఉంది, కానీ వరుస ఓటముల తర్వాత జట్టులో సానుకూల వాతావరణాన్ని కాపాడిన క్రెడిట్ అంతా మా సపోర్ట్ స్టాఫ్‌కే దక్కుతుంది. అంతటి ఒత్తిడిలోనూ వాతావరణం చెడకుండా చూసుకున్నాం, మా ప్రాక్టీస్ కూడా అద్భుతంగా సాగింది. మా విజయాలకు అసలు కారణం ఇదే.” అని రహానే వెల్లడించాడు.
ఇక ఆటగాళ్ల ప్రదర్శన విషయానికి వస్తే, కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పుడు తాము రోవ్‌మన్ పావెల్‌ను రంగంలోకి దించాలని అనుకున్నామని కెప్టెన్ రహానే తెలిపాడు. గ్రీన్ బౌలింగ్ చేసిన విధానం తమపై చూపెట్టిన ప్రభావం చాలా కీలకమైందని చెప్పాడు. అలాగే వరుణ్ చక్రవర్తి, సన్నీ (సునీల్ నరైన్) కలిసి బౌలింగ్ చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. వీరితో పాటు మరికొందరి పేర్లను తాను ప్రత్యేకంగా చెప్పాలని.. అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగిలు డొమెస్టిక్ సీజన్లో చూపించిన ఫామ్‌ను, నమ్మకాన్ని ఇక్కడికి కూడా మోసుకొచ్చారన్నాడు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యత తీసుకుని, ప్రతిసారీ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ముఖ్యంగా మనీష్ పాండే గురించి మాట్లాడుతూ.. “తను తుది జట్టులో లేనప్పుడు కూడా చూపించిన క్రమశిక్షణ, సానుకూల వైఖరి అమోఘం. జట్టులో అవకాశం రానప్పుడు రోజూ మైదానానికి రావడం, బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై కష్టపడటం, జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం ఏ ఆటగాడికైనా అంత సులువు కాదు. కానీ మనీష్ అది చేసి చూపించాడు. ఈ రాత్రి మ్యాచ్‌లో తను ఆడిన ఇన్నింగ్స్ చూసి నేను మాత్రమే కాదు, మా జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు ఎంతో సంతోషిస్తున్నాడు.” అని తెలిపాడు. తమ తదుపరి మ్యాచ్ వ్యూహాల గురించి రహానే మాట్లాడుతూ.. తాము ముందుచూపుతో కాకుండా మ్యాచ్ బై మ్యాచ్ వెళ్లాలని అనుకుంటున్నామన్నాడు.. గత 6-7 మ్యాచ్‌లుగా మాకు బాగా కలిసివచ్చిన సూత్రం ఒక్కటే.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత మ్యాచ్‌పైనే దృష్టి పెట్టడం, మా శాయశక్తులా పోరాడటం, మ్యాచ్ గమనాన్ని మార్చే కీలక క్షణాలను మాకు అనుకూలంగా మార్చుకోవడం. వచ్చే మ్యాచ్‌లోనూ మేము ఇదే పంథాను కొనసామని వెల్లడించాడు.
తాజావార్తలు
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!