IPL 2026 New Trend: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికర ట్రెండ్ నడుస్తోంది. టాప్ బ్యాటర్లు భారీ సెంచరీలు చేసినా.. ఆ ప్లేయర్ జట్టు ఓడిపోతోంది. మరోవైపు కొందరు బ్యాటర్లు తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ఆ ఆటగాడి టీమ్ గెలుస్తోంది. భారీ సెంచరీ కంటే.. మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్‌లు కీలకంగా మారుతున్నాయి. వ్యక్తిగత రికార్డులు కంటే.. జట్టు విజయం ముఖ్యమనే విషయాన్ని ఈ సీజన్ స్పష్టంగా చూపిస్తోంది.
కేఎల్ రాహుల్ 152:
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 152 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. డీసీ ఓడిపోయింది. అదే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 26 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడిన ఇన్నింగ్స్ గెలుపుకు దారి తీసింది.
ర్యాన్ రికెల్టన్ 123:
ముంబై ఇండియన్స్ తరఫున ర్యాన్ రికెల్టన్ 55 బంతుల్లో 123 చేసినా.. ఎంఐ జట్టు ఓటమి పాలైంది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 76 పరుగులతో మ్యాచ్‌ను మలుపుతిప్పి.. తన జట్టుకు విజయం అందించాడు.
వైభవ్ సూర్యవంశీ 103:
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 103 పరుగులు చేసినా జట్టు గెలవలేకపోయింది. అదే సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 71 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించాడు.
సాయి సుదర్శన్ 100:
గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ 58 బంతుల్లో 100 పరుగులు చేసినా జట్టు ఓడిపోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 81 పరుగులతో జట్టును గెలిపించాడు.
క్వింటన్ డీకాక్ 112:
క్వింటన్ డీకాక్ 60 బంతుల్లో 112 పరుగులు చేసినా.. ముంబై ఇండియన్స్‌కు ఉపయోగం లేకపోయింది. అదే మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ 39 బంతుల్లో 80 నాటౌట్ చేసి పంజాబ్ కింగ్స్‌కు విజయం అందించాడు.
ఈ గణాంకాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. టీ20 క్రికెట్‌లో పెద్ద స్కోర్లు చేయడం మాత్రమే కాదు.. సరైన సమయంలో, సరైన వేగంతో ఆడటం ముఖ్యం. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లే అసలైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు.
