IPL CheerLeaders Salary: గ్లామర్‌తో అలరించే చీర్‌లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్‌ఆర్‌హెచ్‌ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!

  • ఐపీఎల్ పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్
  • చీర్‌లీడర్ల పాత్ర కూడా ఎంతో కీలకం
  • చీర్‌లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?
IPL Cheerleaders Salary 2026

IPL Cheerleaders Salary 2026

IPL Cheerleaders Salary 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు.. పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు స్టేడియంలో అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే చీర్‌లీడర్ల పాత్ర కూడా ఎంతో కీలకం. ప్రతి బౌండరీ, సిక్సర్, వికెట్‌కు ప్రేక్షకులను అలరించే చీర్‌లీడర్లు.. ఐపీఎల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అభిమానుల గ్లామర్‌తో అలరించే చీర్‌లీడర్ల సాలరీ ఎంతుంటుందో చాలామందికి తెలియదు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో టీమ్‌ వారీగా చీర్‌లీడర్లకు ఇచ్చే జీతాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

తాజా వివరాల ప్రకారం… చీర్‌లీడర్లకు అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్రాంచైజీ చెల్లిస్తోంది. ఓ మ్యాచ్‌కు ఒక్కో చీర్‌లీడర్‌కు రూ.24,000 నుంచి రూ.25,000 వరకు సాలరీ ఇస్తోంది. ముంబై ఇండియన్స్ (ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ఒక్కో మ్యాచ్‌కు రూ.20,000 చొప్పున చెల్లిస్తున్నాయి. కేకేఆర్, ఎంఐ, ఆర్సీబీ జట్లు చీర్‌లీడర్లకు అత్యధిక పారితోషికం ఇస్తున్న జట్లుగా నిలిచాయి. ఈ మూడు జట్ల బ్రాండ్ వాల్యూ కూడా భారీగా ఉన్న విషయం తెలిసిందే.

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రాంచైజీ తమ చీర్‌లీడర్లకు రూ.15,000 నుంచి రూ.17,000 వరకు ఇస్తోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై మిగతా జట్ల కంటే తక్కువే ఇస్తుందని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్ (జీటీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్లు 15 నుంచి 20 వేల వరకు చెల్లిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) 14-16 వేల వరకు ఇస్తోంది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ప్రాంఛైజీలు మాత్రం కాస్త తక్కువగా రూ.12,000 నుంచి రూ.15,000 వరకు చెల్లిస్తున్నాయి. మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న మన తెలుగు ప్రాంచైజీ ఎస్‌ఆర్‌హెచ్‌ అన్నింటికంటే తక్కువ సాలరీ ఇస్తుండడం విశేషం. ఈ జాబితా చూస్తే జట్ల మధ్య బడ్జెట్, బ్రాండ్ విలువ, ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చులపై వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.