MS Dhoni: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంపై భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించారు. నేను సీఎస్‌కేలో భాగంగా ఉన్నప్పుడు నా జట్టు తప్ప ఇంకెవరైనా ఐపీఎల్ గెలవడం ఊహించలేను.. కానీ ఆర్‌సీబీ ఈ విజయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది అన్నారు. గత ఐపీఎల్ సీజన్ లో వారు అద్భుతంగా ఆడారు.. వారికి హృదయపూర్వక అభినందనలు చెప్పారు. టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి ఆటగాడు తన జట్టే గెలవాలని కోరుకుంటాడు.. అది ప్రతిసారి మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు.. అయినప్పటికీ, ఇతర జట్ల నుంచి నేర్చుకునే అంశాలు ఎంతో కీలకం.. ఇలాంటి పెద్ద టోర్నమెంట్లలో అది మరింత అవసరమని ఎంఎస్ ధోనీ తెలిపారు.
Read Also: Anil Ravipudi: నా తొమ్మిది సినిమాల్లో ఆ మూవీ సీక్వెల్ చేయాలని ఉంది..
అయితే, ఆర్‌సీబీ అభిమానులపై కూడా ధోనీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు నిజంగా అద్భుతం.. జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి మ్యాచ్‌కు వచ్చి తమ టీంకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. కాగా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ గుర్తింపు పొందారు. సీఎస్‌కేను 10 సార్లు ఫైనల్స్‌కు తీసుకెళ్లి, ఐదు సార్లు టైటిల్ అందించారు. 2011 ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్‌సీబీపై గెలిచి సీఎస్‌కే రెండో ట్రోఫీని దక్కించుకుంది. ఇక, ఆర్‌సీబీ మూడు సార్లు ఫైనల్‌లో ఓడిపోయింది. 2009, 2011, 2016 సీజన్లలో టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, రాజత్ పటీదార్ నాయకత్వంలో 2025 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది.
MS Dhoni candid response to a fan asking how he felt after RCB winning 2025 IPL . #MSDhoni pic.twitter.com/BkP71runjz
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) January 21, 2026