IPL 2025: ఐపీఎల్ 2.0 కి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల పదిహేడు నుంచి ఐపీఎల్ పునప్రారంభం కానుంది. మొత్తం 17 మ్యాచ్‌లు జరగనుండగా అందులో 13 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ పునప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, వెళ్లిన వారు వచ్చే పరిస్థితుల్లో లేరు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ,దక్షిణాఫ్రికా ఆటగాళ్లే ఎక్కువమంది ఉన్నారు. మొదట ఆస్ట్రేలియన్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్ ఇండియాకు రాలేరన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బీసీసీఐకి షాక్ ఇవ్వనున్నారు. ఇండియాకు తిరిగి వచ్చినప్పటికీ ప్లేఆప్స్ కు ఉండే పరిస్థితి లేదు.
Bhargavastra: విజయవంతంగా ‘భార్గవస్త్ర’ పరీక్ష ప్రయోగం.. దీని శక్తి ఏ స్థాయిలో ఉంటుందంటే..!
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మే 26 లోపు తమ ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉండాలని కోరింది. ఇక్కడ లీగ్ దశ మ్యాచ్‌లు మే 27 వరకు జరుగుతాయి. ఆ తర్వాత ప్లేఆప్స్ ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితిలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు లీగ్ దశ వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు. దీంతో ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, లుంగీ ఎంగిడి లాంటి భారీ హిట్టర్లు దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవాళ్లే. వీళ్లంతా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఎంపికయ్యారు. స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున, రబాడ గుజరాత్ టైటాన్స్ తరఫున, రికెల్టన్ ముంబై ఇండియన్స్ , లుంగీ ఎంగిడి ఆర్సీబీ తరుపున ఆడుతున్నారు. అయితే రబాడ ఐపీఎల్ నుంచి బ్యాన్ అయిన విషయం తెలిసిందే. ఏదేమైనా.. ఈ స్టార్ ప్లేయర్లు లేకపోతే ఆ ఫ్రాంచైజీలన్నీ ఫైనల్-4కి అర్హత సాధించడం కష్టమేనంటున్నారు.
