NTV Telugu Site icon

SRH vs RR Qualifier 2: హైదరాబాద్, రాజస్తాన్‌ హెడ్ టు హెడ్ రికార్డ్స్.. పిచ్, వాతావరణం డీటెయిల్స్!

Srh Vs Rr Qualifier 2 Rain

Srh Vs Rr Qualifier 2 Rain

IPL 2024 SRH vs RR Qualifier 2 Head-To-Head Records: ఐపీఎల్ 2024లో ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొట్టే జట్టేదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్‌ మైదానంలో క్వాలిఫయర్‌-2 జరగనుంది. 17వ సీజన్‌లో ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్‌లో అద్భుత విజయం సాధించిన రాజస్థాన్‌.. ఫైనల్‌ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్‌-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. రెండో అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. ఇందులో 10 మ్యాచ్‌లు హైదరాబాద్‌ గెలవగా.. 9 మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఓసారి తలపడగా.. సన్‌రైజర్స్‌ ఒక పరుగు తేడాతో నెగ్గింది. రాజస్తాన్‌పై హైదరాబాద్‌ అత్యధిక స్కోరు 217 కాగా.. అత్యల్ప స్కోరు 127. హైదరాబాద్‌పై రాజస్తాన్‌ అత్యధిక స్కోరు 220, అత్యల్ప స్కోరు 102.

పిచ్:
చెన్నైలో ప్రస్తుతం వేడి చాలా ఎక్కువగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉండొచ్చు. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 7 మ్యాచ్‌లలో 5 సార్లు ఛేజింగ్ చేసిన జట్టే నెగ్గింది.

వాతావరణం:
క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎం‌డీ హెచ్చరించింది.

Show comments