ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. వారం తర్వాత ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లకు కరోనా సోకుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుగురు ప్లేయర్లు, కోచ్ లు కరోనా బారిన పడ్డారు. అటు ఇవాళ సన్ రిజర్స్ ఆటగాడు వృద్ధమన్ సాహాకు కూడా కరోనా సోకింది. ఇది ఇలా ఉండగా ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో నిన్న జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ 30 వ మ్యాచ్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
బ్రేకింగ్ : ఐపీఎల్ తాత్కాలిక వాయిదా
