ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 163 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది.
సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (19), మయాంక్ అగర్వాల్ (16) పరుగులు చేసి అనుకున్నంత శుభారంభాన్ని అందించలేకపోయారు. పోయిన మ్యాచ్ లో హీరో.. అభిషేక్ శర్మ (29) పరుగులు చేశారు. మార్క్రమ్ (17), క్లాసెన్ (24), షాబాజ్ అహ్మద్ (22), చివరలో అబ్దుల్ సమద్ (29) మెరుపులు మెరిపించాడు.
ఇక. గుజరాత్ బౌలింగ్ లో మోహిత్ శర్మ 3 వికెట్లతో చెలరేగాడు. కీలక వికెట్లు తీసి జట్టు స్కోరును ఆపడంలో సహాయపడ్డాడు. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ సంపాదించారు.
