NTV Telugu Site icon

GT vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్

Gt Vs Pbks

Gt Vs Pbks

Gujarat Titans Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గురువారం (13-04-23) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 18వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతుంది.

Botsa Satyanarayana: హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి

ఇక ఈ సీజన్‌లో ఇరుజట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడగా.. రెండేసి విజయాలు సాధించాయి. అయితే.. రన్ రేట్ ప్రకారం గుజరాత్ నాలుగో స్థానంలో ఉంటే, పంజాబ్ ఆరో స్థానంలో ఉంది. గత సీజన్‌లోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన గుజరాత్.. ఎంట్రీతోనే కప్ కొట్టేసింది. ఇప్పుడు ఈ సీజన్‌లోనూ అదే జోష్‌తో దూసుకెళ్లి, రెండోసారి టైటిల్ నెగ్గాలని చూస్తోంది. కానీ.. పంజాబ్ మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. ఈ సీజన్‌లో అయినా సత్తా చాటాలని చూస్తోంది. మరి, ఈ ఇరు జట్ల మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి.

Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

Show comments