NTV Telugu Site icon

IPL 2023: ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసి బ్యాటర్లు వీరే..

Kl Rahul

Kl Rahul

Fastest Half-Centuries In IPL History: ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. రేపటి నుంచి క్రికెట్ లవర్స్ కి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వినోదం పంచబోతోంది. రేపు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడబోతున్నాయి. ఐపీఎల్ అంటేనే ఊర కొట్టడు.. 20 ఓవర్లలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అందిస్తుంటుంది. రేపు ప్రారంభం అవబోతున్న ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీపడుతాయి. రెండు నెలల పాటు వినోదాన్ని పంచబోతోంది.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ అనర్హత అంశం.. గమనిస్తున్నామన్న జర్మనీ

అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన జాబితాను పరిశీలిస్తే కేఎల్ రాహుల్ నుంచి ఆడమ్ గిల్‌క్రిస్ట్ దాకా చాలా మందే ఉన్నారు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ పేరుతో ఉంది. వీరిద్దరు కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు సాధించారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్, బోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 2018లో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 14 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు.

ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు:

ర్యాంక్ ప్లేయర్  బాల్స్ ఫర్ 50
1 కేఎల్ రాహుల్ 14
2 పాట్ కమిన్స్  14
3 యూసఫ్ పఠాన్  15
4 సునీల్ నరైన్ 15
5 సురేష్ రైనా 16
6 ఇషాన్ కిషన్ 16
7 క్రిస్ గేల్  17
8 హర్దిక్ పాండ్యా 17
9 పోలార్డ్   17
10 ఆడమ్ గిల్ క్రిస్ట్ 17