NTV Telugu Site icon

Suyash Sharma: సుయాశ్ చర్యకు మండిపడ్డ ఫ్యాన్స్.. నెట్టింట్లో ఏకిపారేశారుగా!

Suyash Wide Ball

Suyash Wide Ball

Fans Fire On Suyash Sharma For Wide Ball During KKR vs RR Match: మే 11వ తేదీన జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (47 బంతుల్లో 98), సంజూ శాంసన్ (29 బంతుల్లో 48) విధ్వంసం సృష్టించడంతో.. 41 బంతులు మిగిలి ఉండగానే ఆర్ఆర్ లక్ష్యాన్ని చేధించింది. కాకపోతే.. 2 పరుగుల తేడాతో యశస్వీ తన సెంచరీని కోల్పోవడం అందరినీ బాధించింది. అయితే.. అంతకుముందు కేకేఆర్ స్పిన్నర్ సుయాశ్ శర్మ చేసిన చర్య పట్ల క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మూడు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. సుయాశ్ వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడు.

Rohit Sharma: మా కెప్టెన్ అందుకే పరుగులు చేయట్లేదు.. ఇషాన్ సెటైరికల్ జవాబు

సుయాశ్ కావాలని వేశాడో లేక అనుకోకుండా వైడ్‌గా వెళ్లిందో తెలీదు కానీ.. క్రీడాభిమానులు మాత్రం కావాలనే సుయాశ్ ఆ వైడ్ వేసేందుకు ప్రయత్నించాడని ఫైర్ అవుతున్నారు. సంజూ అర్థశతకం చేసుకోకూడదని, జైస్వాల్ శతకం చేసుకోకూడదన్న దురుద్దేశంతోనే వైడ్ వేసేందుకు ట్రై చేశాడంటూ విమర్శిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. సుయాశ్‌పై మండిపడ్డాడు. సుయాశ్‌ ఉద్దేశపూర్వకంగానే.. జైస్వాల్‌ను సెంచరీ చేయనీయకుండా అడ్డుకున్నాడని మండిపడ్డాడు. అతడి చర్యని తీవ్రంగా వ్యతిరేకించాడు. పాక్‌ బౌలర్‌, కోహ్లిని సెంచరీ చేయనీకుండా అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండని అన్నాడు. ఇక్కడ సుయాశ్ సరిగ్గా అదే చేశాడన్నాడు. తన సొంత దేశ ఆటగాడి విషయంలో సుయాశ్‌ ఇలా ప్రవర్తించడం​ నిజంగా సిగ్గుచేటు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. సుయాశ్‌ చర్యను పూర్‌ టేస్ట్‌గా అభివర్ణించాడు. సుయాశ్ చర్యని సమర్థించిన వాళ్లని సైతం ఆకాశ్ ఏకిపారేశాడు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

కాగా.. కేకేఆర్‌పై విజయం సాధించేందుకు ఇంకా నాలుగు పరుగులే చేయాల్సి ఉన్నప్పుడు, సుయాశ్ వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ దాన్ని డిఫెండ్ చేశాడు. 94 పరుగుల వద్ద ఉన్న జైస్వాల్‌కు స్ట్రెయిక్ రొటేట్ చేసి, సిక్స్ కొట్టమని సూచించాడు. అయితే.. జైస్వాల్‌ విన్నింగ్‌ షాట్‌ను సిక్సర్‌గా మలచలేకపోయాడు. దీంతో అతడు 98 పరుగుల వద్దే ఆగిపోయి, సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.