Site icon NTV Telugu

ipl 2021 : చెన్నైపై ఢిల్లీ కాపిటల్స్ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా పోరు సాగింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడ్డ ఢిల్లీ కేపిటల్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై టార్గెట్ పెట్టిన 137 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్ మినహా టాప్‌ ఆర్డర్‌ విఫలమవడంతో… ఢిల్లీ కేపిటల్స్ కష్టాల్లో పడింది. అయితే ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్‌… రబాడతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌.. తక్కువ స్కోరే చేయగలిగింది. 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 136 పరుగులతోనే సరిపెట్టుకుంది. అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరి ఓవర్లలో రాయుడు బాదడంతో .. చెన్నై ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది.

Exit mobile version