అర్జున్ టెండూల్కర్ గత రెండు సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు.. కానీ అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంకా తన అరంగేట్రం చేయలేదు. 2021లో, అతను గాయంతో బాధపడ్డాడు. అయితే 2022లో, ముంబయి ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నప్పటికీ అతనికి అవకాశం ఇవ్వలేదు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అయిన అర్జున్, IPL 2023కి ముందు జట్టుతో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
Also Read : Black Hole: సూపర్ మాసీవ్ “బ్లాక్ హోల్”.. సూర్యుడి కన్నా 33 బిలియన్ రెట్ల పరిమాణం..
దీంతో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం గురించి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ (టీమిండియా) రోహిత్ శర్మను మీడియా ప్రశ్నించింది. దీంతో యువ క్రికెటర్‌ను నిరాశపరచని విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానం ఇచ్చారు. అర్జున్ తన బౌలింగ్‌తో చాలా మందిని ఆకట్టుకుంటున్నాడు.. అతను సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఎంపిక కోసం పరిశీలిస్తానని విలేకరులతో రోహిత్ శర్మ అన్నారు. అర్జున్ టెండూల్కర్ ఇప్పుడే గాయం నుంచి బయటకి వస్తున్నాడు.. అతను గత 6 నెలలుగా బౌలింగ్ పరంగా చాలా మంచి ప్రతిభ చూపిస్తున్నాడు.. కాబట్టి అతని ఎంపిక విషయాని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని ముంబయి ఇండియన్స్ హెచ్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు.
Also Read : Umesh Yadav : ఇదే నాకు చివరి సీజన్.. కెప్టెన్సీ నాకు కొత్త కాదు..
ఈసారి ఐపీఎల్ లో తప్పకుండా అర్జున్ టెండూల్కర్ కు అవకాశం కల్పిస్తామని ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. ఈ లీగ్ లో అతన్ని మేము అందుబాటులో ఉంచుకోగలిగితే, అది మాకు చాలా మంచిది అని బౌచర్ చెప్పాడు. టోర్నమెంట్ సమయంలో రోహిత్ శర్యకు కు కొన్నిరోజుల పాటు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని బౌచర్ తెలిపాడు. ఎందుకంటే చాలా ఏళ్ల తరువాత భారత్ వన్డే ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో రోహిత్‌కు విశ్రాంతి ఇస్తున్నామని పేర్కొన్నాడు. త్వరలోనే జట్టుతో కలుస్తాడు.. రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడడు, కానీ మేము పరిస్థితి ఎలా ఉన్నా దానికి అనుగుణంగా ఉంటాము అని బౌచర్ మీడియాతో అన్నారు.
Also Read : Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి