NTV Telugu Site icon

DC vs SRH: బౌలింగ్ చేయాలంటే బయమేసింది: ప్యాట్ కమిన్స్

Pat Cummins Srh

Pat Cummins Srh

Pat Cummins About DC vs SRH Match: తమ బ్యాటింగ్‌ సంతోషాన్ని కలిగించినా.. అదే పిచ్‌పై బౌలింగ్ చేయాలంటే బయమేసిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. పవర్ ప్లేలో ఇరు జట్ల బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారని, బంతి కాస్త పాతబడిన తర్వాత పరుగుల వేగం తగ్గిందన్నాడు. తమ బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 67 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంకు దూసుకొచ్చింది.

మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఇక్కడ మంచి రికార్డు ఉంది. మరో అద్భుతమైన క్రికెట్ మ్యాచ్. విజయాలను కొనసాగించాలి. పవర్ ప్లేలో ఇరు జట్ల బౌలర్లు రాణించలేకపోయారు. ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. బంతి కాస్త పాతబడ్డాక పరుగుల వేగం తగ్గింది. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. మా బ్యాటర్ల ప్రదర్శన చూసి ఎగ్జైట్‌కు గురయ్యా. కానీ మేం కూడా ఇదే వికెట్‌పై బౌలింగ్ చేయాలని తెలిసి కాస్త బయమేసింది. మా బౌలింగ్ పట్ల చాలా సంతోషంగా ఉంది. బౌలర్లు వారి ప్రణాళికలను అమలు చేశారు. ప్రతీ ఒక్కరు క్రమశిక్షణగా ఆడారు’ అని అన్నాడు.

Also Read: Jake Fraser-McGurk: ఓకే ఓవర్‌లో 4,4,6,4,6,6.. మెక్‌గర్క్ విధ్వంసం వీడియో వైరల్‌!

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు సాధించింది. ట్రావిస్‌ హెడ్‌ (89; 32 బంతుల్లో 11×4, 6×6), అభిషేక్‌ శర్మ (46; 12 బంతుల్లో 2×4, 6×6), షాబాజ్‌ అహ్మద్‌ (59; 29 బంతుల్లో 2×4, 5×6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (37; 27 బంతుల్లో 2×4, 2×6) చెలరేగారు. భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. జేక్‌ ఫ్రేజర్‌ (65; 18 బంతుల్లో 5×4, 7×6), భిషేక్‌ పోరెల్‌ (42; 22 బంతుల్లో 7×4, 1×6), రిషబ్ పంత్‌ (44; 35 బంతుల్లో 5×4, 1×6) పోరాడాడు.