Site icon NTV Telugu

CSK vs RR: రాజస్థాన్‌దే బ్యాటింగ్‌.. గెలిస్తేనే చెన్నై నిలిచేది!

Csk Vs Rr

Csk Vs Rr

CSK vs RR Playing 11: ఐపీఎల్‌ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ధృవ్ జురెల్ జట్టులోకి వచ్చాడు. మహీశ తీక్షణ చెన్నై తుది జట్టులోకి వచ్చాడు. రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తాడని, డారిల్ మిచెల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెన్నై సారథి గైక్వాడ్ చెప్పాడు.

ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. అధికారిక ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. 12 మ్యాచ్‌ల్లో ఆరింట గెలుపొందిన చెన్నై.. పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. ఈ మ్యాచ్‌లో చెన్నై తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Polling Centers: వేములవాడలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..

తుది జట్లు:
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ర‌చిన్ ర‌వింద్ర‌, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మోయిన్ అలీ, ర‌వీంద్ర జ‌డేజా, ఎంఎస్ ధోనీ (కీపర్) శార్ధూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమ‌ర్జీత్ సింగ్.
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్.

Exit mobile version