Site icon NTV Telugu

MS Dhoni: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ కాదు.. చెన్నై ట్వీట్ వెనక అసలు విషయం ఏంటంటే!

Ms Dhoni Record

Ms Dhoni Record

CSK Players Celebrate with the fans at Chepauk: ఆదివారం చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు మైదానంలోనే వేచి ఉండాలని కోరింది. ‘చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ మైదానాన్ని వీడొద్దు. మీకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అందరికీ ధన్యవాదాలు’ అని చెన్నై పేర్కొంది. ఈ ట్వీట్ చూసిన ఎంఎస్ ధోనీ ఫాన్స్ కంగారు పడ్డారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే చర్చ జోరుగా సాగింది. చివరకు అది కాదని తేలింది.

ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా అభిమానులకు ప్రత్యేకమైన బహుమతులు అందజేసేందుకే సీఎస్‌కే ఈ ట్వీట్ చేసింది. ప్రతి సీజన్‌లో సొంత మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన అనంతరం ప్లేయర్స్ అందరూ మైదానం చుట్టూ తిరుగుతూ.. అభిమానులకు ధన్యవాదాలు చెబుతారు. అంతేకాదు టెన్నిస్ బాల్స్, బ్యాట్స్, టీ షర్ట్స్‌లను వారికి బహుమతులుగా అందజేస్తారు. ఈ సారి కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎంఎస్ ధోనీ టెన్నిస్ బంతులను అభిమానులకు అందజేశాడు. మధ్యలో సురేష్ రైనా వచ్చి కొనసాగించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Janhvi Kapoor: నిజమే.. వారి డ్రెస్సింగ్‌ స్టైల్‌ని కాపీ కొట్టా: జాన్వీ కపూర్‌

రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టకలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కినెట్టి మూడో స్థానానికి వచ్చింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించింది. చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. చివరి లీగ్ మ్యాచ్‌ను మే 18న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో ఆడనుంది. ఐపీఎల్ 2024లో చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో 7 మ్యాచ్‌లు ఆడి.. 5 విజయాలు సాధించింది. ప్రత్యర్థి మైదానాల్లో 6 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు అందుకుంది.

Exit mobile version