Most wins for a team at a venue in IPL: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అరుదైన రికార్డు నెలకొల్పింది. సొంత మైదానం అయిన ఎంఏ చిదంబరం స్టేడియంలో 50వ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో చెన్నై ఖాతాలో ఈ రికార్డు చేరింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పయి ఛేదించింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42 నాటౌట్; 41 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
సొంత మైదానంలో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ అగ్ర స్థానంలో ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా 52 విజయాలు సాధించింది. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ కూడా 52 విజయాలు సాధించింది. మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానములో ఉంది. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు 42 విజయాలు సాధించింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ 37 విజయాలు సాధించింది.
Also Read: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్!
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంఏ చిదంబరం స్టేడియంలో 7 మ్యాచ్‌లు ఆడి.. 5 విజయాలు సాధించింది. ప్రత్యర్థి మైదానాల్లో 6 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టకలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కినెట్టి.. మూడో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించింది. చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.
Striding past milestones. 🦁💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/OST05UPXWH
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2024