Harpreet Brar Said My aim is to bowl more dot balls: తాను ఎప్పుడూ వికెట్లు తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనని పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ తెలిపాడు. మ్యాచ్‌లో ఎక్కువగా డాట్ బాల్స్ వేయడానికే ప్రయత్నిస్తానని, అప్పుడు ఆటోమేటిక్‌గా వికెట్లు వస్తాయన్నాడు. పిచ్ స్పిన్‌కు సహకరిస్తే బౌలర్లు మరింత చెలరేగుతారని హర్‌ప్రీత్ బ్రార్ చెప్పాడు. బుధవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో బ్రార్ చెలరేగాడు. తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు తీశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Also Read: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐదుగురు స్టార్ బౌలర్లు దూరం!
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు తీసుకున్న అనంతరం హర్‌ప్రీత్ బ్రార్ మాట్లాడుతూ… ‘చెన్నైలోని చెపాక్ పిచ్ బౌలింగ్‌కు బాగా అనుకూలించింది. రాహుల్ చహర్ అద్భుతంగా బంతులు వేశాడు. గత ఆరు ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా. నాకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. సీఎస్‌కే మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేయడం బాగుంది. నేను ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదు. స్టార్స్ ఉన్నా.. సాధారణ మ్యాచ్ లానే భావించా. నా బలాలపై దృష్టి పెట్టా. ఎప్పుడూ వికెట్లు తీయాలనే లక్ష్యంతో నేను మైదానంలోకి దిగను. డాట్ బాల్స్‌ను ఎక్కువగా వేయడానికి ప్రయత్నిస్తా. అప్పుడు ఆటోమేటిక్‌గా వికెట్లు అవే వస్తాయి. పిచ్ స్పిన్‌కు సహకరిస్తే బౌలర్లు మరింత చెలరేగుతారు. నేను కూడా అంతే’ అని అన్నాడు.